![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -108 లో..... పెళ్లి ముహూర్తం గురించి రామరాజు కుటుంబం, భాగ్యం కుటుంబాలు గుడిలో మాట్లాడుకుంటారు. మా ఆచారం ప్రకారం అబ్బాయి ఇంటి వాల్లే పెళ్లి నిశ్చితార్థం జరిపించాలని భాగ్యం అంటుంది. దాంతో అలా ఎలా జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి జరగాలని రామరాజు అంటాడు.
మా ఆచారం ప్రకారం అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుందని భాగ్యం అంటుంది. అది కుదరదని వేదవతి ఖచ్చితంగా చెప్తుంది. దాంతో ఇక తెగేదాకా లాగొద్దని భాగ్యం వాళ్ల ఆయన భాగ్యంతో అనగానే సరే పెళ్లి మా ఇంటి దగ్గర జరిపిస్తామని భాగ్యం చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎలా అని భాగ్యం వాళ్ల ఆయన అంటాడు. మనకి సాయం చెయ్యడానికి ఎవరో ఒకరు వస్తారులే అని భాగ్యం అంటుంది. అప్పుడే భద్రవతి, సేనాపతి ఇద్దరు భాగ్యం దగ్గరికి వస్తారు. మీరు సంబంధం కుదర్చుకున్న వాళ్లు మంచి వాళ్ళు కాదు.. నగల కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు వాళ్ల చిన్న కొడుకు అని భద్రవతి అంటుంది. నువ్వు చెప్పేది మేమ్ ఎందుకు నమ్మాలని భాగ్యం అంటుంది. ఆ పెళ్లి చేసుకుంది నా మేనకోడలిని కాబట్టి ఆ విషయం లో స్టేషన్ కి కూడా వెళ్ళాడు ఆ రామరాజు. మీ కూతురిని ఆ ఇంటికి ఇచ్చి గొంతు కొయ్యకు అని భాగ్యంతో భద్రవతి చెప్పి వెళ్తుంది.
మనకి సాయం చేసేటోళ్లు వస్తారని చెప్పాను కదా.. ఇప్పుడు ఆ రామరాజు తల నా చేతిలో ఉందని భాగ్యం వాళ్ల ఆయనతో అంటుంది. మరొకవైపు ప్రేమ బాధపడుతుంటే నర్మద వచ్చి దైర్యం చెప్తుంది. ఆ తర్వాత రామరాజు మిల్ దగ్గర ఉండగా భాగ్యం తన భర్తని తీసుకొని వస్తుంది. మీ చిన్నకొడుకు నగల కోసం పెళ్లి చేసుకున్నాడంట.. మీరు స్టేషన్ కి వెళ్లారట ఈ విషయం చెప్పనేలేదు.. ఈ విషయం ఆ పిల్ల మేనత్త, అ పిల్ల నాన్న చెప్పారు. ఇప్పుడు నా కూతురిని మీ ఇంటికి ఇవ్వాలంటే భయంగా ఉందని రామరాజుతో భాగ్యం అంటుంది. తరువాయి భాగం లో ధీరజ్ భోజనం బయట నుండి తీసుకొని వస్తారు. ప్రేమ ధీరజ్ లు ఆ భోజనం తింటుంటే వేదవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |